Thursday, July 30, 2009

నిశబ్దం! అంతా నిశబ్దం!
దూరంగా వినిపిస్తున్న నక్కల అరపులు, దగ్గరగా రోదిస్తున్న మనుషుల రోదనలు
అయినా ఆ చెవులకు నిశబ్దం! అంతా నిశబ్దం!

చీకటి! అంతా చీకటి!
దేదీప్యమానంగ ప్రకాశిస్తుంది ఆ దీపం
అయినా ఆ కళ్ళకు చీకటి! అంతా చీకటి!

సౌఖ్యం! అంతా సౌఖ్యం!
ఆ మంటలు దేహాన్ని దహించి వేస్తున్నయి
అయినా ఆ మేనికి సౌఖ్యం! అంతా సౌఖ్యం!

శాంతి! అంతా శాంతి!
గుండెలు బ్రద్దలవుతున్నయి,
అయినా ఆ మనసుకి శాంతి ! అంతా శాంతి
అంతటి ప్రళయం లోనూ ఆ మనిషికి విశ్రంతి

మ్రుత్యువు మనిషికి ఇంతటి శక్తినిస్తుందా! అని నా మనస్సు నివ్వెరపొయింది!
అంతటి శక్తి నన్నెప్పుడు వరిస్తుంది? అని నా గుండె ప్రశ్నిస్తుంది!